భారతదేశం, అక్టోబర్ 12 -- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో కొందరు నేతలు చేరారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమక్షంలో షేక్‌పేట్ డివిజన్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు చెర్క మహేష్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

'జూబ్లీహిల్స్ ప్రజలు 'కారు' కావాలా, 'బుల్డోజర్' కావాలా నిర్ణయించుకోవాలి. జూబ్లీహిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలి. ఎన్నికల్లో బుద్ధి చెబితేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తది. రెండు సంవత్సరాల్లో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్‌లో ఖర్చుపెడతారు. కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ. 10...