భారతదేశం, నవంబర్ 14 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ దాదాపుగా విజయం సాధించారు. రావాల్సిది అధికారిక ప్రకటన మాత్రమే..! ఇప్పటికే 20 వేలకుపైగా మెజార్టీ దాటగా. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్న నవీన్ యాదవ్. విక్టరీని సొంతం చేసుకోబోతున్నారు. స్థానికుడైన నవీన్ యాదవ్.. గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. కానీ ఈసారి ఉపఎన్నికలో మాత్రం విజయం అందుకొని తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన నవీన్‌యాదవ్‌ (42). చిన్న శ్రీశైలం యాదవ్‌ కుమారుడు. బీ.ఆర్క్‌ (ఆర్కిటెక్చర్‌) చదివిన నవీన్ యాదవ్ చాలా ఏళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని తిరుగుతున్నారు. గతంలో ఎంఐఎంలో పని చేసిన నవీన్ యాదవ్. ఆ తర్వాత బయటికి వచ్చారు. చాలా ఏళ్లుగా స్వతంత్రగా పలు కార్యక్రమాలు చ...