భారతదేశం, నవంబర్ 14 -- జూబ్లీహిల్స్ గడ్డపై హస్తం జెండా రెపరెపలాడింది. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఉపఎన్నికను ముందు నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. అప్రమత్తంగా వ్యవహరించింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్ల తర్వాత ఈ ఉపఎన్నిక రావటంతో రేవంత్ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ గా మారింది. ఎలాగైనా ఈ బైపోల్ లో గెలిచి.. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భావించింది. హైదరాబాద్ నగరంలో కూడా పట్టు పెంచుకునే దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగానే గతంలో కంటోన్మెంట్ లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం జరిగిన జూబ్లీహిల్స్ లోనూ జెండాను ఎగరవేసింది.

Published by HT Digital Content Services with permission from HT T...