భారతదేశం, నవంబర్ 14 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకే ఈ ప్రక్రియ మొదలు కాగా. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కించారు. ఈ ఎన్నికలో మొత్తం 101 పోస్టల్ ఓట్లు పోలవగా. ఇందులో కాంగ్రెస్ కు 39 ఓట్లు దక్కాయి. బీఆర్ఎస్ కు 36, బీజేపీకి 10 ఓట్లు పోలయ్యాయి. దీని బట్టి పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ అతి స్వల్ప ఆధిక్యం లభించింది.

మరోవైపు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా షేక్ పేట డివిజన్ ఓట్లను లెక్కించారు. ఇందులో కూడా కాంగ్రెస్ కు 62 ఓట్ల లీడ్ దక్కింది. కాంగ్రెస్ కు 8926, బీఆర్ఎస్ - 8864 ఓట్లు దక్కాయి.

ఈ ఉప ఎన్నికలో మొత్తం పోలైన ఓట్లు 1,94,631గా ఉండగా.. వీటిలో పురుషుల ఓట్లు 99,771గా ఉన్నాయి. ఇక మహిళలు - 94,855, ఇతరుల ఓట్లు 5గా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 48.49 శాతంగా నమోదైంది.

Published by HT Digital Content Services w...