భారతదేశం, నవంబర్ 11 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. పలు సర్వే సంస్థలు తమ ఎగ్టిట్ పోల్స్‌ను ప్రకటించాయి. ఈ పోల్స్ ఫలితాలు ప్రధానంగా రెండు పార్టీల మధ్యే అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు కాంగ్రెస్ పార్టీ వైపై మెుగ్గు చూపుతున్నాయి. కాంగ్రెస్‌కు చాణక్య స్ట్రాటజీస్-46 శాతం, బీఆర్ఎస్‌కు 41 శాతం, బీజేపీకి 06 శాతం గెలుపు అవకాశం ఉందని అంచనా వేసింది.

పబ్లిక్ పల్స్ చూసుకుంటే.. కాంగ్రెస్-48 శాతం, బీఆర్ఎస్-41 శాతం, బీజేపీ-06 శాతంగా ఉంది. స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్- 48.2 శాతం, బీఆర్ఎస్-42.1 శాతం కాగా జన్‌మైన్, హెచ్ఎంఆర్ సర్వేలు కూడా హస్తం పార్టీ వైపే మెుగ్గు చూపుతున్నాయి.

జూబ్లీహిల్స్‌లో సాయంత్రం 5 వరకు 47.16 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6లోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈనెల ...