భారతదేశం, నవంబర్ 2 -- జూబ్లీహిల్స్ బైపోల్ రాజకీయం హీటెక్కింది. రోజురోజుకు అధికార, ప్రతిపక్షాలు విమర్శలతో ప్రచారాన్ని మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది మూడు ప్రధాన పార్టీలు మరింత జోరుగా రంగంలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక అంశం యువతే కావచ్చని నిపుణులు అంటున్నారు. ఎన్నికల కమిషన్ ప్రకారం.. నియోజకవర్గంలోని 4,01,365 మంది ఓటర్లలో యువత కూడా భారీగానే ఉన్నారు.

1,30,042 మంది 18 నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు, ఇందులో దాదాపు 85 శాతం మంది విద్యావంతులు. మరో 46,716 మంది ఓటర్లు 36 నుంచి 40 సంవత్సరాల వయస్సు వారు ఉన్నారు.

ఈ ఓటర్లను ఆకర్శించడానికి రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అంతేకాదు ఐటీ నిపుణులతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. సోషల్ మీడియాపై పట్టు ఉన్న టీమ్స్‌ను నియమించుకున్నాయి. యువతను చేరుకునేందుకు ఉ...