భారతదేశం, అక్టోబర్ 13 -- జూబ్లీహిల్స్ బై పోల్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 22వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 24వ తేదీ దాకా ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఉప ఎన్నిక పోలింగ్ వచ్చే నెల 11న ఉంటుంది. 14న కౌంటింగ్ జరిగి ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.

షేక్‌పేట్ తహశీల్దార్ ఆఫీసులో నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేశారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో మెుత్తం 3.9 లక్షల ఓటర్స్ ఉన్నారు.

సువిధ పోర్టల్ ద్వారా నామినేషన్లు వేయవచ్చు. ఆన్‌లైన్‌లో నామినేషన్ పత్రాలు డౌన్‌లోడ్ చేసుకుని, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఆన్‌లైన్ ద్వారా భర్తీ చేసినా.. స్వయంగా అభ్యర్థి హాజరు కావాలి. సంతకం, ప్రమాణం కో...