భారతదేశం, అక్టోబర్ 9 -- నవంబర్ 11న ఉపఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అభ్యర్థి ఎంపికపై చాలా రోజులు సస్పెన్స్ నెలకొన్నది. తాజాగా అభ్యర్థిని ఏఐసీసీ ప్రకటించింది. సుదీర్ఘ చర్చలు, సర్వేల ఆధారంగా ముగ్గురు పేర్లు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లను ఏఐసీసీకి పంపింది. అయితే తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం నవీన్ యాదవ్‌ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా ప్రకటిచింది.

నవీన్ యాదవ్‌ను ఖరారు చేయడంలో ఈ నియోజకవర్గంలో ఆయనకు ఉన్న పట్టు, సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను బరిలోకి దింపింది. సెంటిమెంట్‌ను అనుకూలంగా మార్చుకోవాలని బీఆర్ఎస్ అనుకుంటుండగా.. ఎలాగైనా ఈ సీటను దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తో...