భారతదేశం, నవంబర్ 14 -- జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ పు ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఆ పార్టీ నవీన్ యాదవ్ 24,729 ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఎన్నికల కమిషన్‌ అధికారిక ప్రకటన ప్రకారం.. కాంగ్రెస్‌కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్‌కు 74,259 ఓట్లు దక్కాయి. ఇక బీజేపీకి 17,061 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్ విజయం సాధించారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి 50.83 శాతం ఓట్లు రాగా. బీఆర్ఎస్ కు 38.13 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఇక బీజేపీకి కేవలం 8.76 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.

2023 ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్ఖి మాగంటి గోపినాథ్ 16,337 ఓట్ల తేడాతో...