Telangana,hyderabad, అక్టోబర్ 7 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ఈ బైపోల్ తో రాష్ట్ర రాజకీయాలు మరో లెవల్ కి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో డైలాగ్ వార్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

జూబ్లీహిల్స్ స్థానంలో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేయకపోయినప్పటికీ. డివిజన్ల వారీగా నేతలను మోహరిస్తోంది. మంత్రుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు కూడా పని చేస్తున్నాయి. ఎలాగైనా ఈ స్థానంలో గెలిచి. సత్తా చాటాలని భావిస్తోంది. సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఖాతా తెరవలేకపోయిన హస్తం పార్టీ. ఆ తర్వాత కంటోన్మెంట్ లో వచ్చిన ఉప ఎన్...