Telangana, సెప్టెంబర్ 11 -- త్వరలోనే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాబోతుంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతుండగా.. ఈ బైపోల్ తో మరో లెవల్ కి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ చెబుతుంటే. అలాంటి పరిస్థితే లేదంటోంది కాంగ్రెస్. ఇదే టైమ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు వాయిస్ పెంచుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

గత అసెంబ్లీ ఎన్నికలో ఇక్కడ్నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ గెలిచారు. అనారోగ్యంతో ఆయన ఇటీవలే మృతి చెందటంతో ఇక్కడ ఉపఎన్నిక రానుంది. దీంతో ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవటం బీఆర్ఎస్ సవాల్ అనే చెప్పొచ్చు. గతంలో కంటోన్మెంట్ లో కూడా సిట్టి...