Telangana,hyderabad, అక్టోబర్ 12 -- రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజకీయాలు రసవత్తరంగా సాగుతుండగా.. ఈ బైపోల్ తో మరో లెవల్ కి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్. ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి... జనంలోకి వెళ్తున్నాయి. అయితే బీజేపీ నుంచి ఎవరు అభ్యర్థిగా ఉంటారనేది తేలాల్సి ఉంది.

బీజేపీకి ఈ ఉపఎన్నిక ఛాలెంజ్ అనే చెప్పొచ్చు. గ్రేటర్ పరిధిలో ఆ పార్టీకి కార్పొరేటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో. జూబ్లీహిల్స్ లో జెండా ఎగరవేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకెల దీపక్​రెడ్డి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీరేకాకుండా కీర్తిరెడ్డి, డాక్టర్...