భారతదేశం, నవంబర్ 8 -- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరింది. మరికొన్ని గంటల్లో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం. రేపు (నవంబర్ 9) సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. దీంతో మైకులు బంద్ కావటమే కాదు. ఇతర ప్రాంతాల నేతలు కూడా నియోజకవర్గం వదిలి వెళ్లాల్సి ఉంటుంది.

ఇవాళ, రేపు మాత్రమే ప్రచారానికి సమయం ఉండటంతో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రతి ఇంటికి వెళ్తూ. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తమ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా.. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి కూడా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం నిర్వహిస్తున్నారు.

జూబ్లిహిల్స్ ఉపఎన్నిక కోసం ...