భారతదేశం, నవంబర్ 10 -- హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు చాలా సీరయస్‌గా తీసుకున్నాయి. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ సమయాన్ని ఈసీ గంటసేపు పెంచింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4.01 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2.08 లక్షలకు పైగా పురుషులు, 1.92 లక్షలకు పైగా మహిళలు. ఈ ఏడాది జూన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఈ బై పోల్‌లో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ నుంచి దీపక్ రెడ్డిని నిలబెట్టగా, మాగంటి గోపీనాథ్ భార్య సునీత బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు...