భారతదేశం, నవంబర్ 13 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన నాటి నుంచి ఈ ఎన్నికలో ఎవరు గెలవబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. అన్ని పార్టీల్లోనూ ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఎవరు గెలవబోతున్నారనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ఓట్ల లెక్కింపు కోసం ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

నవంబర్ 14వ తేదీన యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేయగా. 10 రౌండ్లలో ఉపఎన్నిక ఫలితాలు తేలేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒకటో నెంబర్‌ పోలింత్‌ బూత్‌ షేక్‌పేట డివిజన్‌ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డతో ముగియనుంది. ఓట్ల లెక్కింపు చేపట్టే కేంద్రాల వద్ద భారీగా భద్రత ఉండనుంది.

రహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని 15 కేం...