భారతదేశం, నవంబర్ 9 -- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరింది. ఇవాళ్టితో ప్రచార పర్వానికి తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు మైకులు, నేతల ప్రచారాలు బంద్ కానున్నాయి. ఆ తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

ప్రచారానికి ఇవాళ ఒక్క రోజు మాత్రమే ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేయనున్నాయి. ఇక సాయంత్రం 5 తర్వాత మైకులు బంద్ కావటమే కాదు. ఇతర ప్రాంతాల నేతలు కూడా నియోజకవర్గం వదిలి వెళ్లాల్సి ఉంటుంది.

జూబ్లిహిల్స్ ఉపఎన్నిక కోసం నవంబర్ 11వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇక నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి. ఫలితాలను ప్రకటిస్తారు.

ఉప ఎన్నిక నేపథ్యంలో ఈనెల 11న నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పాఠ...