భారతదేశం, నవంబర్ 14 -- ఇవాళ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉద‌యం 8 గంట‌ల‌కే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.

ఈ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో ఉపఎన్నిక ఫలితం తేలుతుంది. ఒకటో నెంబర్‌ పోలింత్‌ బూత్‌ షేక్‌పేట డివిజన్‌ నుంచి కౌంటింగ్ ప్రారంభమై ఎర్రగడ్డతో ముగియనుంది. రౌండ్ల వారీగా ఓట్ల కౌంటింగ్ వివరాలను ప్రకటించేలా ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేశారు.

నవంబర్ 11వ తేదీన జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 48.49 పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.ఇందులో రహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని 15 కేంద్రాల్లో, బోరబండ డివిజన్‌లోని 13, ఎర్రగడ్డలో 3, వెంగళరావునగర్‌లో ఒక చోట 60 శాతానికిపైగా పోలింగ్‌ న...