భారతదేశం, నవంబర్ 1 -- జూబ్లీహిల్స్‌ మళ్లీ కొడుతున్నామని. ఇక్కడ గెలుపు పక్కా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా షేక్‌పేట్‌లో రోడ్ షోలో నిర్వహించారు.

2023 ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదన్నారు. జూబ్లీహిల్స్‌లో కూడా మాగంటి గోపినాథ్‌ను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తూ ఆరోగ్య సమస్యలతో గోపినాథ్‌ గారు కన్నుమూశారని. ఇలాంటి పరిస్థితుల్లో మాగంటి సునీతను ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదని విమర్శించారు.

"ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో మీరంతా ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. అరచేతిలో స్వర్గం చూపిస్తూ.. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన చూశారు.. రెండేళ్ల కాంగ్రెస్‌ పాలన చూశారు. ఈ రెం...