భారతదేశం, అక్టోబర్ 26 -- రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని కేటీఆర్‌ అన్నారు. జూబ్లీహిల్స్‌ నుంచే బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని వ్యాఖ్యానించారు. శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో పలువురు బీజేపీ నేతలు పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు వాస్తవం కాలేదని, పేదల ఆశలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తగ్గాయని గుర్తుచేశారు. 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీళ్లు, బస్తీ దవాఖానాలు, రూ.5 కే భోజనం, పింఛన్లు, రంజాన్‌ తోఫాతో పాటు అనేక పథకాలు అమలు చేశామని చెప్పారు. ప్రాపర్టీ ట్యాక్స్‌ను కూడా తీసేశామని వివరించారు.

"పేదలను కడుపులో పెట్టుకొని కేసీఆర్‌ చూసుకున్నారు. షేక్‌పేటలో పెద్ద ఫ్లైఓవర్‌ను నిర్మించాం. జీహెచ్‌ఎ...