భారతదేశం, అక్టోబర్ 13 -- జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధి రహమత్‌నగర్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్, హరీశ్ రావుతోపాటుగా బీఆర్ఎస్ కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి అసభ్యంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. పేగులు మెడలో వేసుకుంటానని ఎప్పుడూ అంటుంటారని, ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడూ చూడలేదన్నారు. గతంలో కాంగ్రెస్ తరఫున జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్ పోటీ చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఇస్తానని ఆయనను పక్కనపెట్టారన్నారు. జుబ్లీహిల్స్ ఓటర్లు పంచ్ కొడితే ఆ దెబ్బ కాంగ్రెస్ హైకమాండ్‌కు తగలాలి అని పిలుపునిచ్చారు. కారు కావాలా? బుల్డోజర్ కావాలా? అనేది ఓటర్లు తేల్చుకోవాలన్నారు....