భారతదేశం, అక్టోబర్ 8 -- జూబ్లీహిల్స్ బైపోల్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థిని ప్రకటించింది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. తర్జన భర్జనలు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. నగరం నడిబొడ్డున ఉన్న సీటు కావడంతో ఆశావాహులు కూడా ఎక్కువే ఉన్నారు.

నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి 25,000 కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీ సాధించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక లక్ష్యమని సమాచారం. రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని పార్టీ నాయకులకు సీఎం తెలియజేసినట్లు అంటున్నారు. ఫైనల్ డెసిషన్ కోసం కోసం నలుగురు పేర్లతో కూడిన ప్యానెల్‌ను పార్టీ హైకమాండ్‌కు పంపినట్టుగా తెలుస్తోంది.

లిస్ట్ ఫైనల్ చేసే ముందు ప్రతి అభ్యర్థి ఎన్నికల బల...