భారతదేశం, నవంబర్ 12 -- జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక స్వల్ప ఉద్రిక్తతల మధ్య ముగిసింది. మంగళవారం (నవంబర్ 11) 407 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. పోలింగ్‌ గడువు ముగిసే సమయానికి మొత్తం పోలింగ్ 48.47 శాతంగా నమోదైందని అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఫిర్యాదుల గురించి పోలీసులకు నివేదించామని.. వారు వెంటనే వాటిపై చర్యలు తీసుకున్నారని చెప్పారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై పోలీసు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలతో బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నిబంధనలను ఉల్లంఘించి పోల...