భారతదేశం, నవంబర్ 11 -- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్ నడుస్తోంది. ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 9 శాతం పోలింగ్ నమోదు కాగా.. 11 గంటలకు సంబంధించిన ఓటింగ్ శాతం 20.76గా ఉందని ఈసీ వివరాలు విడుదల చేసింది.

ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటు వేశారు. ఎల్లారెడ్డిగూడ నవోదయనగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఓటు వేశారు. నాగార్జుననగర్‌లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి, యూసఫ్‌గూడా వెంకటగిరిలోని నాజర్ స్కూల్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వినియోగించుకున్నారు. పలువురు వీఐపీలు ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు. షేక్‌పేటలో కుటుంబసభ్యులతో కలిసి దర్శకుడు రాజమౌళి ఓటు వేశారు.

జూబ్లీహిల్స్ పోలింగ్ బూత్‌ల వద్ద నాన్ లోకల్ కాంగ్రెస్ నేతలు తిరుగుతున్నారని బీఆర్ఎస్ మండిపడింది. ఎమ్మెల్యే ...