భారతదేశం, నవంబర్ 13 -- జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోరు కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా నడిచింది. 48.47 శాతం పోలింగ్ నమోదైంది. ఎప్పటిలాగే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. జూబ్లీహిల్స్ ఓటర్లు ఓటింగ్ కేంద్రాలకు రాలేదు. దీంతో పోలింగ్ శాతం తక్కువే నమోదైంది.

కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకోవడానికి తీవ్రంగా పోరాడగా, భారత రాష్ట్ర సమితి దానిని నిలుపుకోవడంపై దృష్టి పెట్టింది. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. నవంబర్ 14న ఫలితాలు రానున్నాయి. ప్రధాన పార్టీలు డివిజన్లు, మురికివాడలు, అపార్ట్‌మెంట్లలో భారీగా ఖర్చు చేశాయని వార్తలు వచ్చాయి.

అనేక పార్టీల బూత్ కమిటీలు నగదు పంపిణీ జాబితాలను తయారు చేసి, తరువాత వాటిని పోలింగ్ ఏజెంట్లు నిర్వహించే ఓటర్ల జాబితాలతో పోల్చాయని తెలుస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాత పార్టీల కార్యకర...