Hyderabad, జూన్ 27 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. శుక్రుడు జూన్ 29న మధ్యాహ్నం 1:56 నిమిషాలకు వృషభ రాశిలో సంచరిస్తాడు.

ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ యోగాలు ఏర్పడతాయి. మరికొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శుక్రుని వృషభ రాశి సంచారంతో ఎవరు ఎలాంటి ఫలితాలను ఎదుర్కొంటారు? ఎవరికి ఏ ఇబ్బంది కలుగుతుంది? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సింహ రాశి వారికి శుక్రుని వృషభ రాశి సంచారం చిన్నపాటి ఇబ్బందులను తీసుకువస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారు మానసిక ఒత్తిడి, చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగాల్లో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాలి. ఆటంకాలు కూడా ఉండొచ్చు. అధికారులతో కొన్ని వివాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి సింహ రాశి వారు చేసే పనుల పట్ల జాగ్రత్తగా...