Hyderabad, జూన్ 17 -- ప్రతి ఏటా ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి దాకా తొమ్మిది రోజులు వారాహి అమ్మవారి నవరాత్రులను జరుపుతారు. ఈసారి వారాహి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి? ఆ రోజు ఏమేం చేయాలి? ఆ తొమ్మిది రోజులు చేయవలసిన పూజలు, నైవేద్యాలు మొదలైన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆషాఢ పాడ్యమి నుంచి నవమి దాకా తొమ్మిది రోజులు పాటు వారాహి నవరాత్రులు జరుపుకోవాలి. ఈ ఏడాది జూన్ 26 నుంచి జూలై 4 వరకు వచ్చాయి. చాలా మంది భక్తులు వారి కోరికలు నెరవేరాలని, కష్టాలు తొలగిపోవాలని నిష్ఠగా వారాహి నవరాత్రులను జరుపుతారు.

వారాహి నవరాత్రులను సాధారణంగా మన ప్రాంతాలలో జరిపారు. చాలా మంది ఇళ్లల్లో అమ్మవారి చిత్రపటాన్ని కూడా పెట్టరు. అయినా సరే అమ్మవారికి ఈ నవరాత్రుల సమయంలో పూజ చెయ్యచ్చు. అందులో తప్పు లేదు. పూజ చేసేటప్పుడు చిన్న ఫోటోని పెట్టి, ఎర్రటి పూలను సమర్పించి, అష్ట...