Hyderabad, జూన్ 25 -- వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు ప్రేమ, అందం, కళ, సంపదకు చిహ్నంగా పరిగణిస్తారు. శుక్రుడు తన నక్షత్రాన్ని మార్చినప్పుడు, అది రాశుల జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. శుక్రుడు మార్పు వలన ప్రేమ సంబంధాలు, ఆర్థిక పరిస్థితి, సృజనాత్మక సామర్థ్యాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది.

జూన్ 26న శుక్రుడు కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు ఉంటాయి. కానీ కొన్ని రాశుల వారు మాత్రం చిన్నపాటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో చిన్నపాటి సమస్యలు, ఆర్థిక పరంగా ఇబ్బందులు వంటి సమస్యలు చోటు చేసుకోవచ్చు.

శుక్రుడు నక్షత్ర మార్పు కన్య రాశి వారికి చిన్నపాటి సమస్యలను తీసుకురావచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు సామాజిక, వ్యక్తిగత జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలు లేదా ప్రవర్తన కారణంగా సమాజంలో అపార్థాలు రావ...