Hyderabad, జూన్ 20 -- అన్ని గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల రాశి మార్పు 12 రాశులను ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు గ్రహాల సంచారం కారణంగా శుభయోగాలు ఏర్పడతాయి. శుభయోగాలలో గజకేసరి యోగం కూడా ఒకటి. ఇది గురు, చంద్రుల కలయికతో ఏర్పడుతుంది. చంద్రుడు మనసుకి కారకుడు కాబట్టి, వృత్తిలో విజయం, ఒత్తిడినుంచి ఉపశమనం లాంటివి కొన్ని రాశులవారు పొందవచ్చు. జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న దాని ప్రకారం, ఈ యోగం మరోసారి ఏర్పడనుంది.

చంద్రుడు జూన్ 24న రాత్రి 11:45 గంటలకు మిధున రాశిలో సంచరిస్తాడు. గురువు ఇప్పటికే అదే రాశిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మిధున రాశిలో గురు, చంద్రుల కలయిక ఏర్పడుతుంది. దీంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా మారుతుంది.

వృషభ రాశి వారికి గజకేసరి రాజయోగం అనేక మార్పులను తీసుకువస్తుంది. ప...