భారతదేశం, మే 14 -- ఏపీలో ఒకే రోజు రెండు కీలక పథకాలు ప్రారంభించనున్నారు. జూన్ 12న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో ప్రకటించింది.

ప్రతినెలా అమలు చేసే సంక్షేమ పథకాల వివరాలతో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12 నాటికి ఏడాది కానుంది. ఈ సందర్భంగా జూన్ 12న తల్లికి వందనం కింద చదువుతున్న విద్యార్థులందరికీ రూ.15 వేలు ఖాతాల్లో జమ చేయనున్నారు.

అలాగే జూన్ 12న అన్నదాత సుఖీభవ పథకం (మూడు విడతల్లో రూ.20 వేలు) ప్రారంభించనుంది. అదే రోజున లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పింఛన్లు అందించనున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....