భారతదేశం, మే 18 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సినిమా ఎగ్జిబిటర్లు (థియేటర్ ఓనర్స్) సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లను బంద్ చేయాలని డిసైడ్ అయ్యారు. హైదరాబాద్‍లో నేడు (మే 18) రెండు తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. జూన్ 1 నుంచి నిరవధికంగా థియేటర్లను మూసేస్తామని ప్రకటించారు. నిర్మాతలకు ఓ డిమాండ్ చేశారు.

సినిమాలను రెంట్ పద్ధతిలో ఇక ప్రదర్శించలేమని, పర్సంటేజ్ రూపంలో చెలిస్తేనే సాధ్యమవుతుందని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ప్రముఖ నిర్మాతలు దిల్‍రాజు, సురేశ్ బాబు కూడా హాజరయ్యారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.

రోజువారి అద్దె కాకుండా గ్రాస్‍ కలెక్షన్లలో వాటా ఇస్తేనే సినిమాలను ఇక ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. జూన్ 1వ తేదీ నుంచి...