Hyderabad, ఫిబ్రవరి 7 -- కేరళలోని పలు సినిమా సంఘాలు సమ్మె హెచ్చరికలు జారీ చేశాయి. అక్కడి ప్రభుత్వం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లను నెరవేర్చకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. జూన్ 1 నుంచి ఈ సమ్మె చేయనున్నారు. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మరీ ఎక్కువగా ఉండటం, నటీనటుల రెమ్యునరేషన్ పెరగడంతో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆ సంఘాలు చెబుతున్నాయి.

కేరళలో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎంతలా నష్టపోతున్నారో కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, నటుడు జీ సురేశ్ కుమార్ వెల్లడించాడు. ఎంటర్టైన్మెంట్ పై డబుల్ ట్యాక్స్ లు, సినిమా టికెట్లపై జీఎస్టీ ద్వారా కేరళలో ప్రొడ్యూసర్లు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆయన చెప్పారు.

దీనిని వ్యతిరేకిస్తూ జూన్ 1 నుంచి అన్ని సినిమా షూటింగులు, థియేటర్లలో మూవీస్ స్క్రీనింగ్ నిలిపేస్త...