భారతదేశం, మే 5 -- వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్‌ఎస్‌ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల అన్నారు. ఈ సభతో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ వైపు చూస్తున్నారనే విషయం రుజువైందని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందన్నారు. ఎల్కతుర్తిలో రజతోత్సవ వేడుకల్ని కొనసాగింపుగా రాబోయే సంవత్సర కాలం పాటు వివిధ దేశాలలో నిర్వహిస్తామని మహేష్ బిగాల తెలిపారు.

ముందుగా అమెరికాలోని డల్లాస్ నగరంలో డీఆర్ పెప్పర్ అరేనాలో జూన్ 1, 2025 నాడు అట్టహాసంగా బీఆర్ఎస్ రజతోత్సవం నిర్వహిస్తున్నారని మహేష్ బిగాల తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆహ్వానించామని తెలిపారు. రాబోయే రోజుల్లో యూఎస్ఏతో పాటు వివిధ దేశాలలో నిర్వహిస్తారని అన్నారు.

ఈ కార్యక్రమాల...