భారతదేశం, మే 21 -- ఏపీలో జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించడంతో పాటు ప్రపంచ రికార్డు నెలకొల్పే కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

విశాఖ ఆర్కే బీచ్‌ సముద్ర తీరంలో ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఆర్కే బీచ్‌ నుంచి బోగాపురం వరకు లక్షలాది మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పుతారు. ప్రపంచ యోగా దినోత్సవానికి ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో నెల రోజుల పాటు యోగ ఆంధ్రా కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రారంభించింది.

నెల రోజుల్లో 2లక్షల మందికి యోగలో సర్టిఫికెట్‌ పొందే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. జూన్ 21న ఐదు లక్షల మందితో విశాఖ సముద్ర తీరంలో ఆర్కే బీచ్‌ ఒడ్డున యోగాసానాలు చేపడతారని ఉదయం 7 నుంచి 8 మధ్యలో ప్రపంచ రికార్డ్‌ నెలకొల్పే కార్యక్రమాన్ని ని...