భారతదేశం, జూలై 14 -- గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటీ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న జూనియర్ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. యాక్టింగ్ తో పాటు అందచందాలతో ఫ్యాన్స్ ను మరోసారి మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతుంది ఈ ముద్దుగుమ్మ. మరోసారి హాట్ షోతో అదరగొట్టబోతోంది. కిరీటీ, శ్రీలీల కాంబినేషన్లో వస్తున్న ఈ ఫిల్మ్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం శ్రీలీల ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనేది హాట్ టాపిక్ గా మారింది.

జూనియర్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది శ్రీలీల. ఈ మూవీ కోసం ఆమె భారీ మొత్తం తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. ఏకంగా రూ.2.5 కోట్లు ఆమెకు చెల్లించారని తెలుస్తోంది. కిరీటీకి ఫస్ట్ మూవీ కావడంతో జూనియర్ సినిమా మొత్తం శ్రీలీల భుజాలపై మోసే ఛాన్స్ ఉంది. ఆమె గ్లామర్, యాక...