Hyderabad, సెప్టెంబర్ 19 -- టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గాయాలయ్యాయి. ఓ యాడ్ షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అతని టీమ్ కూడా ఈ వార్తలను కన్ఫమ్ చేసింది. అయితే ఈ గాయాలేమీ అంత పెద్దవి కాదని స్పష్టం చేసింది. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపింది.

జూనియర్ ఎన్టీఆర్ యాడ్ షూటింగ్ సందర్భంగా కింద పడినట్లు తెలిసింది. దీంతో అతనికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని అతని టీమ్ కూడా ధృవీకరించింది. అయితే ఇదేమంత పెద్ద ప్రమాదం కాదని తేలడంతో అతని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఓ ప్రకటన కూడా జారీ చేసింది. "ఓ యాడ్ షూటింగ్ లో మిస్టర్ ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డాడు. డాక్టర్ల సలహా మేరకు పూర్తిగా కోలుకోవడానికి వచ్చే రెండు వారాల పాటు అతడు విశ్రాంతి తీసుకోనున్నాడు. అతని పరిస్థితి నిలకడగానే ఉంది. ఆందోళన చెందా...