Hyderabad, జూలై 27 -- వేద జ్యోతిష్యం ప్రకారం, కుజుడు జులై 28న కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. ధైర్యం, శక్తి, పోరాటపటిమా, పోరాటానికి ప్రతీక. కుజుడు జీవితంలో కార్యాచరణ, శౌర్యాన్ని తీసుకొస్తాడు. కుజుడు ఆరోగ్యం, సంబంధాలు, ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తాడు. జాతకంలో కుజుడు స్థానం బలహీనంగా ఉంటే ఒత్తిడి, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు వంటివి కలుగుతాయి.

జులై 28న కుజుడు కన్య రాశిలోకి ప్రవేశించడంతో 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలు పొందితే, కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశుల వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చిన్న చిన్న సమస్యలు తప్పవు.

కన్య రాశిలో కుజుడు ప్రవేశం మిథున రాశి వారికి చిన్నపాటి ఇబ్బందుల్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఖర్చులు పెరిగిపోతాయి, ఆరోగ్యం...