భారతదేశం, జూన్ 26 -- జులై 15 నుంచి భారతదేశంలోని ద్విచక్ర వాహనాలు హైవేలపై టోల్ చెల్లించాల్సి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎంతో కాలంగా ఫ్రీగా వెళ్తున్న మినహాయింపు ముగుస్తుంది. కొత్త టోల్ ఫీజును ప్రవేశపెట్టడం వెనక అనేక అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రధానంగా ఆదాయం, ట్రాఫిక్ నిర్వహణపై దృష్టి. ఫీజు అమలు చేయడం ద్వారా అన్ని వాహన వినియోగదారుల నుంచి రోడ్డు నిర్వహణ ఖర్చును వసూలు చేయవచ్చు. అన్ని వాహనాలకు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి అని ప్రభుత్వం భావిస్తోంది.

జూలై 15, 2025 నుండి ద్విచక్ర వాహనాలు హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద టోల్ ఫ్రీ ఉండదని తెలుస్తోంది. ఈ చర్యపై ప్రభుత్వం కీలకంగా చర్చిస్తుంది. FASTag ద్వారా డిజిటల్ టోల్ వసూలు వ్యవస్థ పరిధిలోకి ద్విచక్ర వాహనాలను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రధాన మార్పును తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటోంది....