భారతదేశం, జూలై 2 -- కియా ఇండియా తన కొత్త కారెన్స్ క్లావిస్ ఎలక్ట్రిక్ విడుదల తేదీని ప్రకటించింది. జులై 15న ఈ ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీని కంపెనీ లాంచ్ చేయనుంది. కంపెనీ అధికారిక వివరాల ప్రకారం.. ఈ కారు జులై 15న ఉదయం 11:59 గంటలకు లాంచ్ అవుతుంది. 7 సీట్ల ఎమ్‌పీవీ కారెన్స్ మార్కెట్లో హిట్ అయింది. భారత మార్కెట్లో ఎర్టిగా తర్వాత అత్యధికంగా అమ్ముడైన రెండో ఎంపీవీ ఇది. ఇప్పుడు ఈ కారు ఎలక్ట్రిక్ మోడల్‌పై కంపెనీ భారీగా ఆశలు పెట్టుకుంది. జనాలను ఈ సీటర్‌తో లవ్‌లో పడేయాలనే ఆలోచనలో ఉంది కంపెనీ. ఈ సెగ్మెంట్లో మొదటి మూడు వరుసల ఈవీ అవుతుంది.

కారెన్స్ క్లావిస్ ఈవీ క్రెటా ఎలక్ట్రిక్ మాదిరిగానే బ్యాటరీ ప్యాక్ అందించే అవకాశం ఉంది. ఇది దాదాపు ఒకే బ్యాటరీ ప్యాక్, మోటారు ఎంపికలను పొందవచ్చు. క్రెటా ఎలక్ట్రిక్ ప్రస్తుతం 42 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌లు (390 కిలోమీటర్ల రేంజ...