భారతదేశం, జూలై 11 -- అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్‌లోకి అధికారికంగా ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, ముంబైలో తమ మొట్టమొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను జులై 15న ప్రారంభించనుంది. ఇది బాంద్రా కుర్లా కాంప్లెక్స్​లో ఉంటుంది. దేశంలోనే తొలి సెంటర్ కావడంతో, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు! అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. ఈ కీలక అడుగు టెస్లా ప్రపంచంలోనే మూడొవ అతిపెద్ద ఆటోమోటివ్ మార్కెట్‌లోకి ప్రవేశించినట్లు అధికారికంగా సూచిస్తుంది.

ముంబై తర్వాత, టెస్లా రెండో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ దేశ రాజధాని దిల్లీలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. టెస్లా తమ షాంఘై ప్లాంట్ నుంచి మోడల్ వై రేర్-వీల్ డ్రైవ్ ఎస్‌యూవీలను భారతదేశానికి తీసుకురావడం ప్రార...