భారతదేశం, జూలై 12 -- దేశంలో బంగారం ధరలు జులై​ 12, శనివారం భారీగా ధరలు పెరిగాయి. దేశ రాజధాని 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 600 పెరిగి.. రూ. 99,183కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 9,918గా కొనసాగుతోంది.

మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 550 వృద్ధి చెంది.. రూ. 90,933కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 9,093గా ఉంది.

గత నెల రూ. 1లక్ష మార్క్​ దాటిన బంగారం ధర, ఆ తర్వాత కాస్త పడి, ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,785గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 99,035గా ఉంది. ముంబైలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,787 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 99,307గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర ...