భారతదేశం, జూన్ 29 -- దక్షిణ భారతదేశంలో కావాల్సినన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. మర పొరుగున ఉన్న రాష్ట్రాల్లో అద్భుతాలు చూడొచ్చు. మీరు ఈసారి ఏదైనా కొత్త ప్రదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే.. దక్షిణ భారతదేశంలో అనేక టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ప్రకృతి అందాలతో అనేక సరస్సులు, జలపాతాలు, చెరువులు, నదులు కనిపిస్తాయి. జులైలో ప్రయాణించాలనుకుంటే.. ఈ 5 ప్రదేశాల గురించి చూడండి.

1. చిక్కమగళూరు అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి జులై నెల ఉత్తమ సమయం. వర్షాకాలంలో ఇక్కడి కాఫీ తోటలు, కొండలు మరింత అందంగా కనిపిస్తాయి. ఈ మాసంలో కురిసే వర్షం కాఫీ, తడి నేల వాసనను వెదజల్లుతుంది.

2. దక్షిణ భారతదేశంలో తప్పకుండా చూడాల్సిన పర్యాటక ప్రదేశాలలో ఒకటైన దండేలి సాహసంతో నిండి ఉంటుంది. ఉత్తర కర్ణాటకలోని ఈ ప్రదేశంలో రివర్ రాఫ్టింగ్, జంగిల్ సఫారీలు...