Hyderabad, మే 15 -- జుట్టు రాలిపోవడం చుండ్రు, పొడిదనం, వెంట్రుకలు చిట్లపోవడం వంటి సమస్యలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది రకరకాల నూనెలు, షాంపూలు, స్ప్రేలు, కండీషనర్లు వాడుతుంటారు. అయితే వీటిల్లో చాలా రసాయనాలు ఉంటాయనీ ఇవి ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయని మీకు తెలుసా? వీటిలో ఉండే కొన్ని రకాల రసాయనాలు క్యాన్సర్‌ను కూడా కలిగించొచ్చని అంటున్నారు. ముఖ్యంగా ఫార్మాల్డిహైడ్ అనే రసాయనం లుకేమియా అనే రక్త క్యాన్సర్‌కు కారణం కావచ్చని తాజా పరిశోధనల్లో కనుగొన్నారు. ఇది చాలా మంది ఆడవాళ్లు ప్రతిరోజూ వాడే చాలా రకాల సౌందర్య ఉత్పత్తుల్లో ఇది ఉంటుందంట.

2025 మే నెలలో వచ్చిన ఒక పరిశోధన ప్రకారం చాలా మంది ఆడవాళ్లు ఫార్మాల్డిహైడ్ ఉన్న ఉత్పత్తులు వాడుతున్నారు. లాస్ ఏంజిల్స్‌లో 70 మంది ఆడవాళ్లు తాము వాడే ఉత్పత్తుల లేబ...