Hyderabad, ఏప్రిల్ 15 -- జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని రకాల ఆయుర్వేద మూలికలు వాడడం ద్వారా వెంట్రుకలను కాపాడుకోవచ్చు. ఆయుర్వేద మూలికలైన జిన్సింగ్, గ్రీన్ టీ, భ్రింగరాజ్, అవిసె గింజలు వంటివి జుట్టును కాపాడుతాయి. వీటన్నింటినీ ఇంట్లోనే చాలా సులువుగా ఉపయోగించవచ్చు. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ఆయుర్వేద మూలికలు ఇవన్నీ.

ఆయుర్వేద షాపుల్లో ఇక్కడ చెప్పిన పదార్థాలు దొరుకుతాయి. జిన్సింగ్ కూడా ఒక అద్భుతమైన మూలిక. ఇది తలపై ఉన్న చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు కుదుళ్లను, వేళ్ళను బలోపేతం చేస్తుంది.

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు మందంగా పెరిగేలా సహాయపడతాయి. ప్రతిరోజు గ్రీన్ టీ తాగడంతో పాటు ఆ మిగిలిన గ్రీన్ టీ పొడిని తలకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి.

భ్రింగరాజ్ అనేది ఆయుర్వేద మూలికల్లో రారాజ...