Hyderabad, ఏప్రిల్ 22 -- పొడవైన, ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టును పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కాలుష్యం, ఒత్తిడి, రసాయనాలతో కూడిన ఉత్పత్తుల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా వేలకు వేలు ఖర్చు పెట్టడం అవసరం లేదు. ఎందుకంటే ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన సహజ నూనెలను అందించింది.వీటిని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ నూనెలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడమే కాకుండా, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి సహజమైన మెరుపును, మృదుత్వాన్ని పెంచుతాయి. మరి జుట్టు పెరుగుదలకు సహాయపడే ఆ ఉత్తమమైన సహజ నూనెలు ఏంటి? వాటిని ఎలా ఉపయోగించాలి? తెలుసుకుందాం రండి.

ఇది జుట్టు కుదుళ్లలోకి సులభంగా చొచ్చుకుపోతుంది. జుట్టు ప్రోటీన్‌ను కోల్పోకుండా చేస్తుంది, అలాగే ఎదుగుదలకు కావాల్సిన తేమను అందిస్తుంది. ఇందులో ఉండే లారిక్ యాసిడ్ (lauric acid) శి...