Hyderabad, ఏప్రిల్ 17 -- జుట్టు రాలిపోవడం, చివర్లు చిట్లిపోయి ఎదుగుదల ఆగిపోవడం, పీలగా, నిర్జీవంగా కనిపించడం వీటిలో ఏ ఒక్క సమస్యైనా మీకు ఉండే ఉండచ్చు. దీనికి మీరు రకరకాల క్రీములు, రసాయనాలతో కూడిన ఉత్పత్తులను వాడి ఉండచ్చు. నిజానికి అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో పాటు రసాయనాలతో కూడిన ఉత్పత్తులు, రంగులను ఉపయోగించడం వల్ల ఈ రోజుల్లో సమస్యలు మరింత పెరిగిపోతున్నాయి. ఇవి మృదువైన మీ జుట్టును దెబ్బతీసి బరకగా, బలహీనంగా మారుస్తాయి.

మీ జుట్టు ఇలా అయిపోయిందని బాధపడుతూ కూర్చోవాల్సిన అవసరం లేదు. సెలూన్లకు, డాక్టర్లు చుట్టూ తిరగాల్సిన అవసర్లేదు. కేవలం ఇంటి రెమెడీలతో అది కూడా వంటగదిలో దొరికే సాధారణమైన సామాన్లతో పరిష్కారం పొందొచ్చు. అదెలా అంటారా.. రండి చూసేద్దాం.

గుడ్లతో పాటు ఆవకాడోల నుండి తేనె, కొబ్బరి నూనె వరకు అందుబాటులో ఉండే సహజ పదార్థాలు దెబ...