Hyderabad, మే 17 -- జుట్టు పెరగడానికి బయోటిన్ చాలా అవసరం. వయసు పెరిగే కొద్ది జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, పలచబడడం అనేవి జరుగుతూ ఉంటాయి. జుట్టు బాగా పెరగాలంటే ప్రతిరోజూ విటమిన్ బి7 అత్యవసరం. విటమిన్ బి7 ని బయోటిన్ అని కూడా పిలుస్తారు.

ఆరోగ్యకరమైన జుట్టును పెంచేందుకు బయోటిన్ ఉపయోగపడుతుంది. మీరు ప్రతిరోజు బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడడమే కాదు.. జుట్టును ఒత్తుగా పెంచుకోవచ్చు. ఏ ఏ ఆహారాల్లో బయోటిన్ అధికంగా ఉంటుందో ఇక్కడ ఇచ్చాము.

గుడ్లలో బయోటిన్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొనలో బయోటిన్ ఉంటుంది. అలా అని తెల్ల సొన తినకుండా పడేయమని కాదు. తెల్ల సొన, పచ్చ సొన రెండు తినాల్సిందే. బయోటిన్ తో పాటు ప్రోటీన్, ఇనుము కూడా పుష్కలంగా అందుతాయి. ఈ మూడు కూడా బలమైన జుట్టును నిర్మించడానికి, వెంట్రుకలకు రక్త...