భారతదేశం, డిసెంబర్ 17 -- డబుల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీని షేక్ చేస్తోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఆడియన్స్ కు థ్రిల్ అందిస్తోంది. అదే నేరుగా ఓటీటీలోకి వచ్చిన 'సాలి మొహబ్బత్' చిత్రం. జీ5లో ఇది ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. మరి ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో టాప్-5లో ఉన్నవాటిపై ఓ లుక్కేయండి.

ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు జీ5 ఓటీటీలోని సాలి మొహబ్బత్ మూవీకి వస్తున్న రెస్పాన్స్ అందుకు నిదర్శనం. ఈ డబుల్ మిస్టరీ థ్రిల్లర్ డైరెక్ట్ గా జీ5 ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు ఇండియాలోనే నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది ఈ హిందీ సినిమా. ఇందులో రాధికా ఆప్టే, దివ్యేందు, అనురాగ్ కశ్యప్, అన్షుమాన్ పుష్కర్ తదితరులు నటించారు.

జీ5 ఓటీటీలో తెలుగు కామెడీ మూవీ 'ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో' కూడా ...