భారతదేశం, ఆగస్టు 31 -- ఓటీటీలో రివేంజ్ థ్రిల్లర్లు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. ఈ తరహా మూవీస్, సిరీస్ లకు ఫ్యాన్ బేస్ ఎక్కువే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఉన్న ఇలాంటి బెస్ట్ రివేంజ్ థ్రిల్లర్లపై ఓ లుక్కేయండి. ఇందులో సిరీస్ లు, సినిమాలున్నాయి. మలయాళం, హిందీ, తెలుగు భాషల్లోని ఈ థ్రిల్లర్లు ఏంటో చూసేయండి.

మలయాళం యాక్షన్ థ్రిల్లర్ 'నరివెట్ట'. ఈ మూవీ రివేంజ్ థ్రిల్లర్ కూడా. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన ఈ మూవీ జీ5 ఓటీటీలో సత్తాచాటుతోంది. ఓ గిరిజన గూడెంలో తన తోటి పోలీస్ ఒకరు కనిపించకుండా పోతారు. అతణ్ని వెతుక్కుంటూ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అయిన హీరో వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత అమాయక గిరిజన ప్రజలపై అధికారం జులూం చూస్తాడు. అడవిలోని గిరిజన గూడెంను ఖాళీ చేయించాలనే పన్నాగాన్ని పసిగడతాడు. తన సొంత పోలీస్ డిపార్ట్మెంట్ ...