భారతదేశం, నవంబర్ 13 -- గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. నిత్యం ఏదో ఒక చోట అవినీతి అధికారులు దొరికిపోతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల మున్సిపాలిటీలో కూడా ఏసీబీ సోదాలు చేపట్టింది. లంచం తీసుకుంటుండగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్ తో పాటు అతని సహాయకుడు వడాల వంశీ కృష్ణ అడ్డంగా దొరికిపోయారు.

ఏసీబీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో జీ+4 భవనాన్ని నిర్మించుకోవడానికి కావలసిన అనుమతి కోసం దరఖాస్తు వచ్చింది. అప్లికేషన్ ను ప్రాసెస్ చేసి. అనుమతిని జారీ చేయడానికి ఫిర్యాదుధారుని నుంచి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయిన వరప్రసాద్ రూ.75,000 లంచం డిమాండ్ చేశాడు.

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అడిగిన డబ్బ...