Hyderabad, ఆగస్టు 30 -- ఆకట్టుకునే సీరియల్స్​, అలరించే రియాల్టీ షోలతో అలరిస్తున్న జీ తెలుగు ఈ వినాయక చవితికి ప్రేక్షకులకు మరింత వినోదం పంచనుంది. మరో ప్రత్యేక కార్యక్రమంతో జీ తెలుగు తన బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.

భక్తి, వినోదం కలగలసిన జీ తెలుగు అందిస్తున్న గణేష్​ చతుర్థి సంబరం గం గం గణేశా. సంస్కృతి, సంప్రదాయం మేళవించిన ఘనమైన వేడుక.. వెండితెర, బుల్లితెర తారల సందడితో సరదాగా సాగిన గం గం గణేశా ఈ ఆదివారం అంటే ఆగస్ట్ 31న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

జీ తెలుగు నటీనటులు అందరూ కలిసి ఈ వినాయక చవితిని ప్రత్యేకంగా జరుపుకోనున్నారు. యాంకర్​ రవి, వర్షిణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో హీరోయిన్​ సదా, హీరో మంచు మనోజ్​ ప్రత్యేక అతిథులుగా హాజరై సందడి చేశారు.

ఇలా నటీనటుల గ్రాండ్ ఎంట్రీతో ప్రారంభమయ్యే ఈ వేడుక ఆద్యం...